టీపీసీసీ ఆధ్వర్యంలో ‘చలో లోక్ భవన్’ నిరసన ర్యాలీ
ఇండియా కూటమి ‘సేవ్ డెమోక్రసీ’ పిలుపులో భాగంగా నిరసనలో పాల్గొన్న మంత్రి
హైదరాబాద్, అక్టోబర్ 09, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించే వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పోరాటం కొనసాగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఇండియా కూటమి ఇచ్చిన ‘సేవ్ డెమోక్రసీ’ పిలుపులో భాగంగా శుక్రవారం టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో లోక్ భవన్’ నిరసన ర్యాలీలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ సంస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసిన మంత్రి, ఆ డిమాండ్ నెరవేరే వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తుందని తెలిపారు.










Leave a Reply