మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
మంచిర్యాల: సెప్టెంబర్ 28 (AYUSH24 News ప్రతినిధి)
సీసీ నస్పూర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందడం అత్యంత బాధాకరమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులతో మాట్లాడి తెలుసుకున్నట్లు ఎంపీ వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా సీసీ నస్పూర్ జాతీయ రహదారిపై అవసరమైన భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించాలని పోలీసు అధికారులకు సూచించినట్లు తెలిపారు.
మంచిర్యాల మెడికల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, వారికి అవసరమైన సహాయక చర్యలను పర్యవేక్షించాలని సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు.
ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని వంశీకృష్ణ పేర్కొన్నారు. ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
జాతీయ రహదారులపై ప్రయాణించే సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply