మంథని, సెప్టెంబర్ 18 (ప్రతినిధి): స్వాతంత్ర్య సమరయోధుడు, మంథని ప్రాంతానికి చెందిన దివంగత రాపల్లి కృష్ణయ్య సేవలను స్మరించుకుంటూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆయన నివాసాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా రాపల్లి కృష్ణయ్య చిత్రపటానికి మంత్రి శ్రీధర్ బాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను నేటి తరాలు స్మరించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. వారి సేవలు, త్యాగాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
అనంతరం రాపల్లి కృష్ణయ్య కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Tags:
#మంథని #రాపల్లికృష్ణయ్య #శ్రీధర్‌బాబు #స్వాతంత్ర్యసమరయోధుడు #స్వాతంత్ర్యసమరయోధులుత్యాగాలు #మంథనివార్తలు #AYUSH24N











Leave a Reply