అంబేద్కర్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ — పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు
హన్మకొండ, అక్టోబర్ 05, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
ఏఐసీసీ పిలుపు మేరకు హన్మకొండలో డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ‘ఇండియా’ కూటమి నేతలు ప్రజాస్వామ్య పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు.
అంబేద్కర్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు సాగిన పాదయాత్రలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కె.ఆర్. నాగరాజు, హుజూరాబాద్ ఇన్చార్జ్ వొడితెల ప్రణవ్ తదితర నాయకులతో కలిసి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు.
అనంతరం కలెక్టరేట్ వద్ద కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ఆయన రాజీనామా చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు.










Leave a Reply