Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ
Home › బ్రేకింగ్ న్యూస్ › ✈️ 24 గంటలకు పైగా నిలిచిపోయిన స్పైస్‌జెట్ విమానాలు
బ్రేకింగ్ న్యూస్

✈️ 24 గంటలకు పైగా నిలిచిపోయిన స్పైస్‌జెట్ విమానాలు

03:47 మధ్యాహ్నం PM

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు సంస్థ వెల్లడి

హైదరాబాద్, సెప్టెంబర్ 15 – అయుష్ 24 న్యూస్

ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌కు చెందిన రెండు విమానాలు 24 గంటలకు పైగా ఆలస్యమయ్యాయి. నిర్ణీత సమయానికి విమానాలు బయలుదేరకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు విసుగు చెందిన ప్రయాణికులు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు.

స్పైస్‌జెట్‌కు చెందిన ఎస్‌జీ 5111, ఎస్‌జీ 5105 విమానాలు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం దుబాయ్‌కు బయలుదేరాల్సి ఉంది. ఒక విమానం ఉదయం, మరో విమానం సాయంత్రం బయలుదేరాల్సి ఉండగా.. నిర్ణీత సమయానికి విమానాలు బయలుదేరలేదు. పలుమార్లు విమానాల షెడ్యూల్‌ను రీషెడ్యూల్ చేసినప్పటికీ ప్రయాణం ప్రారంభం కాలేదని ప్రయాణికులు తెలిపారు.

దాదాపు 24 గంటలు గడిచినా విమానాలు బయలుదేరకపోవడంతో సుమారు 200 మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే నిరీక్షించాల్సి వచ్చినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం నుంచి టెర్మినల్-3 వద్ద పలుమార్లు ప్రయాణికులు నిరసన వ్యక్తం చేశారు.

ప్రయాణికుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయ అధికారులు స్పైస్‌జెట్ సంస్థను సంప్రదించారు. విమానాల ఆలస్యంపై సంస్థ విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని స్పైస్‌జెట్ ప్రతినిధి వెల్లడించినట్లు తెలుస్తోంది. సమస్యను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, మంగళవారం సాయంత్రం వరకు విమానాలను దుబాయ్‌కు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

విమానాల ఆలస్యానికి గల కచ్చితమైన కారణాన్ని సంస్థ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

– అయుష్ 24 న్యూస్

THE VOICE OF TRUTH

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 14🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App