Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ
Home › బ్రేకింగ్ న్యూస్ › 🕯️ అభినయ్ రాజు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
బ్రేకింగ్ న్యూస్

🕯️ అభినయ్ రాజు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

04:01 సాయంత్రం PM

కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

దేవరకొండ, సెప్టెంబర్ 15 – అయుష్ 24 న్యూస్

దేవరకొండ పట్టణానికి చెందిన గాజుల రాజేష్ కుమారుడు గాజుల అభినయ్ రాజు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ మంగళవారం గాజుల రాజేష్, గాజుల ఆంజనేయులు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా అభినయ్ రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు.

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కన్న కొడుకును కోల్పోయిన తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమని అన్నారు. అభినయ్ రాజు ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

జగదీశ్ రెడ్డిని చూసిన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి, రవీంద్ర కుమార్ కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి మనోధైర్యం కల్పించారు. అభినయ్ రాజు జ్ఞాపకాలను స్మరించుకుంటూ ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది గాజుల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, రామచంద్ర నాయక్, మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, బిల్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

– అయుష్ 24 న్యూస్

THE VOICE OF TRUTH

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 134🔗 Shares: 6👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
225 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App