పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ, సెప్టెంబర్ 30, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
దేవరకొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అధికారులను ఆదేశించారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
నియోజకవర్గ పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామాలు, తండాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు చెప్పారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అధికారులను ఆదేశించారు.









Leave a Reply