Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › తెలంగాణ › ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం హోరాహోరీ
తెలంగాణ

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం హోరాహోరీ

02:48 మధ్యాహ్నం PM

పదేళ్ల తర్వాత ఎన్నికలు — కూటములుగా బరిలోకి కార్మిక సంఘాలు

రాష్ట్ర, రీజియన్ స్థాయి గుర్తింపు సంఘాలకు కార్మికులకు రెండేసి ఓట్లు

హైదరాబాద్, అక్టోబర్ 07, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. వచ్చే నెల 9న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కార్మిక సంఘాలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. సుమారు పదేళ్ల అనంతరం ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతుండటంతో కార్మిక సంఘాల్లో ఎన్నికల సందడి నెలకొంది.

ఈసారి యూనియన్లు వేర్వేరు కూటములుగా ఏర్పడి బరిలోకి దిగడంతో ముక్కోణపు పోరు నెలకొంది. తెలంగాణ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూయూ)కు అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించగా, ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ)కు సీపీఐ మద్దతు ప్రకటించింది. దీంతో ఈ ఎన్నికలకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.

ఈ ఎన్నికల్లో ప్రతి కార్మికుడికి రెండు ఓట్లు ఉంటాయి. ఒక ఓటు రాష్ట్ర స్థాయి గుర్తింపు సంఘానికి, మరో ఓటు రీజియన్ స్థాయి గుర్తింపు సంఘానికి వేయాల్సి ఉంటుంది.

వామపక్ష పార్టీల అనుబంధ కార్మిక సంఘాలైన ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) వేర్వేరు కూటముల్లో ఉన్నాయి. ఈయూతో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) జట్టు కట్టాయి. ఈ కూటమి నుంచి రాష్ట్ర స్థాయి గుర్తింపు సంఘానికి ఈయూ పోటీ చేస్తోంది.

ఆర్టీసీలో మొత్తం 11 రీజియన్లు ఉండగా, వరంగల్, ఖమ్మం రీజియన్లలో ఎన్‌ఎంయూ, మిగిలిన తొమ్మిది రీజియన్లలో రీజియన్ స్థాయి గుర్తింపు సంఘం కోసం టీఎంయూ ఈ కూటమి తరఫున బరిలో నిలిచాయి.

మరోవైపు సీఐటీయూ అనుబంధ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్), తెలంగాణ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూయూ)తో జట్టు కట్టడంతో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 16🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App