NSUI ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు
హైదరాబాద్, అక్టోబర్ 05, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకలకు సంబంధించిన పోస్టర్ను యాదాద్రి దేవస్థానం మెంబర్ చిలప్పగారి విజయ రాజాం, టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ రేగులపాటి రమ్య రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఉస్మానియా యూనివర్సిటీ NSUI ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా విద్యార్థుల భాగస్వామ్యంతో బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
NSUI నాయకుడు మేడ శ్రీను అధ్యక్షతన నిర్వహించనున్న ఈ వేడుకల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినీ, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని వేడుకలకు మరింత శోభ తీసుకురావాలని కోరారు.
ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పేలా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.










Leave a Reply