ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్.. ర్యాలీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్: సెప్టెంబర్ 28 (AYUSH24 News ప్రతినిధి)
భారత ఎన్నికల సంఘం స్వతంత్రత, విశ్వసనీయత, సంస్థాగత సమగ్రతను పరిరక్షించాలనే డిమాండ్‌తో టీపీసీసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన నిరసన ర్యాలీలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నుంచి తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం వరకు ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌ను కాంగ్రెస్ ఇటీవల జాతీయ స్థాయిలోనూ లేవనెత్తింది.

ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎస్ఐఆర్కు సంబంధించిన నిర్ణయాలు ముగ్గురు ఎన్నికల కమిషనర్ల ఏకాభిప్రాయంతోనే తీసుకున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply