Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌తో ఎరువుల బుకింగ్‌ సులభం
బ్రేకింగ్ న్యూస్

ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌తో ఎరువుల బుకింగ్‌ సులభం

02:35 మధ్యాహ్నం PM

48 గంటల్లో ఎరువులు పొందే అవకాశం.. అన్ని కేటగిరీల రైతులకు అవకాశం

మంథని, ఆగస్టు 31: ఎరువుల పంపిణీని పారదర్శకంగా, సులభతరం చేసేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ అందుబాటులోకి తెచ్చిన ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ ద్వారా రైతులు తమకు అవసరమైన అన్ని రకాల ఎరువులను ముందస్తుగా నమోదు చేసుకోవచ్చని మంథని మండల వ్యవసాయ అధికారి డాక్టర్‌ దాసరి నవ్య తెలిపారు. నమోదు చేసుకున్న రైతులకు 48 గంటల్లో ఎరువులు అందేలా వ్యవస్థను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

పట్టాదారు రైతులతో పాటు మరణించిన పట్టాదారుల వారసత్వం నమోదు కాని భూములను సాగు చేస్తున్న రైతులు, కౌలు రైతులు, అటవీ హక్కుల పట్టాలు కలిగిన వారు, పోడు భూములు, దేవాదాయ శాఖ భూములు, ప్రభుత్వ, సంస్థలు, సామాజిక భూములు సాగు చేస్తున్న రైతులు కూడా ఈ విధానం ద్వారా ఎరువులు పొందవచ్చని తెలిపారు.

ఆధార్‌, ఫోన్‌ నంబర్‌ ధ్రువీకరణ అనంతరం భూమి వివరాలు నమోదు చేసేటప్పుడు సంబంధిత కేటగిరీని ఎంపిక చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ రికార్డుల్లో భూమి ఉన్న రైతులు, చట్టపరమైన వారసులు, యజమానులుగా ఉండి భూమి వివరాలు రెవెన్యూ రికార్డుల్లో నవీకరించబడని రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు.

భూమి వివరాలు నమోదు కాని రైతులు ‘భూమిని జోడించు’ ఎంపిక ద్వారా సాగు చేస్తున్న భూమి సర్వే నంబర్‌, విస్తీర్ణాన్ని నమోదు చేస్తే సంబంధిత వ్యవసాయ అధికారి పరిశీలనకు వెళ్తుందని తెలిపారు. అధికారి ఆమోదం పొందిన తర్వాత ఎరువులను నమోదు చేసుకుని పొందవచ్చన్నారు.

రైతులకు ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ ద్వారా ఎరువులు నమోదు చేసుకోవడంలో ఇబ్బందులు లేకుండా వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, ఎరువుల విక్రయదారులు సహకరిస్తున్నారని డాక్టర్‌ దాసరి నవ్య తెలిపారు.

జిల్లాలో ఎరువుల నిల్వలు, సరఫరా, పంపిణీపై వ్యవసాయ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోందని, రైతులు ఎరువుల లభ్యతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.

అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 23🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
1 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *