Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › ఏపీలో కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు సన్నాహాలు
బ్రేకింగ్ న్యూస్

ఏపీలో కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు సన్నాహాలు

03:48 తెల్లవారుజాము AM

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రెండు, మూడు రోజుల్లో ప్రక్రియ ప్రారంభం

అమరావతి, సెప్టెంబర్ 6, అయుష్ 24 న్యూస్:
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రెండు, మూడు రోజుల్లో దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులతో పాటు అన్ని కేటగిరీలకు సంబంధించిన పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.

పింఛన్లకు సంబంధించి ఏయే కేటగిరీలకు దరఖాస్తులు స్వీకరించాలి, వాటిని ఏ విధంగా పరిశీలించాలనే అంశాలపై గురువారం రాత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సెర్ప్ అధికారులు చర్చించినట్లు సమాచారం. అనంతరం సంబంధిత అంశాలను అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించారు.

ఈ అంశాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, ఆయన ఆమోదం అనంతరం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

దశలవారీగా పింఛన్ల పంపిణీపై పరిశీలన

కొత్త పింఛన్ల కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్యను బట్టి లబ్ధిదారులకు పింఛన్లు ఒకేసారి మంజూరు చేయాలా? లేక దశలవారీగా మంజూరు చేయాలా? అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి ఆమోదం అనంతరం దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన విధివిధానాలు, అర్హతలు, ప్రక్రియపై అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 9🔗 Shares: 9👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
0 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *