Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › రాజకీయాలు › ఓటు హక్కు పరిరక్షణ కోరుతూ కాంగ్రెస్ మహా ధర్నా
రాజకీయాలు

ఓటు హక్కు పరిరక్షణ కోరుతూ కాంగ్రెస్ మహా ధర్నా

12:55 తెల్లవారుజాము AM

ఎస్‌ఐఆర్‌పై అభ్యంతరాలు.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం: సెప్టెంబర్ 28 (AYUSH24 News ప్రతినిధి)

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతత్వాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించారు.

ఏఐసీసీ పిలుపులో భాగంగా తెలంగాణలోని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్నది పార్టీ ప్రధాన డిమాండ్లలో ఒకటిగా ఉంది.

డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపుపై కాంగ్రెస్ లేవనెత్తుతున్న అభ్యంతరాలను ప్రస్తావిస్తూ, ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడాలని నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఎస్‌ఐఆర్‌పై నిరసనలు చేపట్టగా, ఎన్నికల సంఘం మాత్రం ఈ ప్రక్రియకు సంబంధించిన నిర్ణయాలు చట్టబద్ధమైన విధానాల ప్రకారమే జరుగుతున్నాయని, తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరిస్తోంది.

ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పిలుపు మేరకు టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.

కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కినేని శ్యామ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాలే ప్రసాద్, నాయకులు ఈది గణేష్, పోశాలు, బానోత్ భద్రు, వెంకన్న, లక్ష్మయ్య, సైదులు, సంజయ్, రాందాస్, శేఖర్, రమేష్, లాలు, కుమార్, సత్యనారాయణ, శంకర్, నగేష్, అర్జునరావు, సుధాకర్, సిద్ధు, సుధీప్ తదితరులు పాల్గొన్నారు.

అయుష్ 24 న్యూస్ — The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 17🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
22 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App