Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › తాజా వార్తలు › కన్నాల గ్రామంలో డంప్యాడ్ మట్టిని పరిశీలించిన జిల్లా కలెక్టర్
తాజా వార్తలు

కన్నాల గ్రామంలో డంప్యాడ్ మట్టిని పరిశీలించిన జిల్లా కలెక్టర్

09:20 ఉదయం AM

రైతుల సమస్యపై వెంటనే స్పందించిన కలెక్టర్ కోయ శ్రీ హర్ష

కన్నాల, ఆగస్టు 20 — అయుష్ 24 న్యూస్:
కన్నాల గ్రామాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం సందర్శించారు. ఇటీవల మండల సర్వసభ్య సమావేశంలో కన్నాల గ్రామ రైతులు ఎదుర్కొంటున్న సమస్యను గ్రామ సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఓసీపీ-3 ఆర్జీటీ నుంచి డంప్యాడ్‌కు తరలించిన మట్టి వచ్చి పొలాల్లో పేరుకుపోవడంతో పంట పొలాలు మట్టితో కప్పబడి రైతులు తీవ్రంగా నష్టపోయారని సర్పంచ్ కలెక్టర్‌కు వివరించారు. సమస్యపై వెంటనే స్పందించిన కలెక్టర్ గ్రామానికి చేరుకుని డంప్యాడ్ మట్టిని పరిశీలించారు.

ఇకపై పొలాల్లోకి మట్టి రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్జీ-3 జీఎం మధుసూదన్ను కలెక్టర్ ఆదేశించారు.

అలాగే పొలాల్లో పంట కోతలు పూర్తయిన వెంటనే కన్నాల ఊర చెరువుకు వెళ్లే ఒర్రెను పూడికతీసి అభివృద్ధి చేయాలని సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్ కలెక్టర్‌ను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ వెంటనే ఒర్రెకు పూడికతీత పనులు చేపట్టి, అవసరమైన చోట లైనింగ్ ఏర్పాటు చేయాలని ఆర్జీ-3 జీఎం మధుసూదన్‌కు సూచించారు.

రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులతో సమన్వయం చేస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్, సింగరేణి అధికారులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

— అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 4🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *