దేవరకొండ నియోజకవర్గం TRS అధ్యక్షుడిగా ఇటీవల నియామకం
దేవరకొండ | సెప్టెంబర్ 16 | AYUSH24 NEWS ప్రతినిధి
దేవరకొండ నియోజకవర్గం తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన కట్ట కొమ్ము తండాకు చెందిన నేనావత్ శివ నాయక్ బుధవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. దేవరకొండ ఎస్టీ నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేస్తూ క్రియాశీలకంగా పనిచేయాలని శివ నాయక్‌కు సూచించినట్లు తెలిపారు. గిరిజనుల హక్కులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, విద్యార్థులకు సంబంధించిన సమస్యలపై ప్రజల తరఫున పోరాడాలని సూచించినట్లు పేర్కొన్నారు.
తనను దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించినందుకు కల్వకుంట్ల కవితకు శివ నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని, త్వరలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన తెలిపారు.










Leave a Reply