Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ
Home › బ్రేకింగ్ న్యూస్ › కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది: మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్
బ్రేకింగ్ న్యూస్

కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది: మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్

11:43 ఉదయం AM

మంథని, సెప్టెంబర్ 18 (ప్రతినిధి): పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ గుర్తించి తగిన అవకాశాలు కల్పిస్తుందని మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ అన్నారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆశీస్సులతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యదర్శిగా ఎన్నికైన ఆరెల్లి కిరణ్ గౌడ్, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ చైర్మన్‌గా వంగల తిరుమలేష్, శ్రీ గౌతమేశ్వర ఆలయ చైర్మన్‌గా గుండ రాజు నియమితులైన సందర్భంగా మంథని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గం తరఫున వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వోడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన కార్యక్రమాలు, మంథని నియోజకవర్గంతో పాటు మంథని మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆరెల్లి కిరణ్ గౌడ్‌కు సూచించారు.

అలాగే రాబోయే గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ చైర్మన్ వంగల తిరుమలేష్, శ్రీ గౌతమేశ్వర ఆలయ చైర్మన్ గుండ రాజు కృషి చేయాలని కోరారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై దృష్టి సారించాలని సూచించారు.

శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వద్ద పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆలయ చైర్మన్‌కు సూచించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముగ్గురికి మంత్రి శ్రీధర్ బాబు, దుద్దిళ్ల శ్రీను బాబు, మున్సిపల్ పాలకవర్గం తరఫున పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యదర్శి ఆరెల్లి కిరణ్ గౌడ్, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ చైర్మన్ వంగల తిరుమలేష్, శ్రీ గౌతమేశ్వర ఆలయ చైర్మన్ గుండ రాజు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దుద్దిళ్ల శ్రీను బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 49🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App