Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › కాంగ్రెస్ 1000 రోజుల విధ్వంస పాలనపై పోరుబాట విజయవంతం చేయాలి
బ్రేకింగ్ న్యూస్

కాంగ్రెస్ 1000 రోజుల విధ్వంస పాలనపై పోరుబాట విజయవంతం చేయాలి

03:51 మధ్యాహ్నం PM

16వ వార్డు కౌన్సిలర్ కేతావత్ రూప్ల నాయక్ పిలుపు

దేవరకొండ, సెప్టెంబర్ 1: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాలు, ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం దేవరకొండ పట్టణంలో నిర్వహించనున్న భారీ ర్యాలీ, మహాధర్నాను విజయవంతం చేయాలని 16వ వార్డు కౌన్సిలర్ కేతావత్ రూప్ల నాయక్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నుంచి భారీ ర్యాలీ ప్రారంభమై, బస్‌స్టాండ్‌ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తోందని రూప్ల నాయక్ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.

పోరుబాట మహాధర్నాకు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 47🔗 Shares: 1👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
0 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *