Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › కార్మికుల హక్కుల కోసం సమరశీల పోరాటాలు చేసేది ఏఐటీయూసీ
బ్రేకింగ్ న్యూస్

కార్మికుల హక్కుల కోసం సమరశీల పోరాటాలు చేసేది ఏఐటీయూసీ

08:31 ఉదయం AM

అయుష్ 24 న్యూస్ | కరీంనగర్

కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం సమరశీల పోరాటాలు చేసేది ఏఐటీయూసీ అని ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు అన్నారు. సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో కరీంనగర్‌లో నిర్వహించనున్న ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కరీంనగర్‌లో జరిగే రాష్ట్ర 4వ మహాసభల్లో సమగ్రంగా చర్చించి, కార్మికులంతా ఐక్యమై పోరాటాలు నిర్వహించాలని ఆయన అన్నారు. కార్మికుల హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడిపై ఉందని పేర్కొన్నారు.

స్వాతంత్ర్యానికి పూర్వమే భారతదేశంలో కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడిన సంఘం ఏఐటీయూసీ అని నూనె వెంకటేశ్వర్లు తెలిపారు. కార్మికులకు కనీస వేతనాలు అందించాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కార్మికుల పట్ల ప్రభుత్వాలు చూపుతున్న సవతి తల్లి ప్రేమను వీడాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలు, హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్ర 4వ మహాసభలకు కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నూనె వెంకటేశ్వర్లు కోరారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నాగిళ్ల సహదేవ్, ఏనుక సత్తయ్య, డి. ఆంజనేయులు, ఏ. వెంకటేష్, కొప్పుల నాగేష్, కరంటు నార్య, గోరటి ఇద్దయ్య, ఎం. వెంకటయ్య, నూనె దేవయ్య, గోరటి సైదులు, కే. రమేష్, ఎం. శ్రీను, ఏనుక అంజయ్య, పి. జంప్ల మస్తాన్, బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 11🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *