జమ్మికుంటకు చెందిన వేద పండితుడు బ్రహ్మశ్రీ మండలేముల శ్రీ కపర్తి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
హైదరాబాద్, సెప్టెంబర్ 14 | AYUSH24 NEWS ప్రతినిధి:
వినాయక చవితి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగి, ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు.
సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన భార్య, కుమార్తె, అల్లుడు, మనవడు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలంతా తమ తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని సూచించారు.
జమ్మికుంట వేద పండితుడి ఆధ్వర్యంలో పూజలు
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన ఆస్థాన వేద పండితులు బ్రహ్మశ్రీ మండలేముల శ్రీ కపర్తి శర్మ (అయ్యగారు) సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో నిర్వహించిన వినాయక పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించడం విశేషంగా నిలిచింది.
వేద మంత్రోచ్ఛారణల మధ్య గణపతి పూజా కార్యక్రమం నిర్వహించినట్లు సమాచారం.
AYUSH24 NEWS
నిజమైన సమాచారం • నిష్పక్షపాత వార్తలు









Leave a Reply