పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎస్. రాము చౌహాన్
AYUSH24 News ప్రతినిధి
దేవరకొండ: సెప్టెంబర్ 30
తెల్దేవరపల్లి గ్రామానికి చెందిన కేతావత్ ముని నాయక్ సతీమణి కేతావత్ సాలి మృతి బాధాకరమని ఎల్ఐసీ మలక్‌పేట సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్. రాము చౌహాన్ అన్నారు.
బుధవారం ఆయన కేతావత్ సాలి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆమె లేని లోటు ముని నాయక్ కుటుంబానికి తీరనిదని పేర్కొన్నారు. కేతావత్ రామచంద్ర నాయక్‌ను కూడా పరామర్శించి సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా విశ్రాంత అడిషనల్ కలెక్టర్ ఎస్. మోతిలాల్, ఎల్ఐసీ మలక్‌పేట బ్రాంచ్ హైదరాబాద్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్. రాము చౌహాన్, సపావట్ రవి, గ్రామ సర్పంచ్ విజయరాములు, మాజీ ఎంపీటీసీ పార్వతి చందు నాయక్, ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్ లిమ్యా నాయక్, యువ నాయకుడు సపావట్ రవి నాయక్, జిల్లా నాయకుడు కిన్నర్ హరికృష్ణ, బంజారా సంఘం అధ్యక్షుడు కేతావత్ లక్ష్మా నాయక్, మాజీ ఎంపీటీసీ మహాలక్ష్మి, పార్వతి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఆయుష్ 24 న్యూస్ — The Voice of Truth









Leave a Reply