Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › కేవలం 5 ఏళ్ల వయస్సులో ప్రపంచ రికార్డు సాధించిన అచంపేట చిన్నారి బి. విఠత్ రామ్
బ్రేకింగ్ న్యూస్

కేవలం 5 ఏళ్ల వయస్సులో ప్రపంచ రికార్డు సాధించిన అచంపేట చిన్నారి బి. విఠత్ రామ్

10:16 ఉదయం AM

హైదరాబాద్‌, ఆగస్టు 24, ఆయుష్ 24 న్యూస్

కేవలం ఐదేళ్ల వయస్సులోనే అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా అచంపేటకు చెందిన చిన్నారి బి. విఠత్ రామ్ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించాడు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 1వ వరల్డ్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్–2026 సందర్భంగా స్పీడ్ పంచింగ్, స్పీడ్ కికింగ్ విభాగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించాడు.

రికార్డు కార్యక్రమంలో విఠత్ రామ్ కేవలం ఒక నిమిషంలో 200 స్పీడ్ పంచ్‌లు, ఒక నిమిషంలో 100 స్పీడ్ కిక్‌లు విజయవంతంగా పూర్తి చేసి తన వేగం, శారీరక సామర్థ్యాన్ని చాటాడు. ఈ ఘనతకు గుర్తింపుగా హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అవార్డుతో పాటు గోల్డ్ మెడల్ అందజేసి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా హై రేంజ్ వరల్డ్ రికార్డ్స్ తెలంగాణ హెడ్ సుమన్, అమికల్ స్పోర్ట్స్ అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్ వీణా వాహిని, జేఆర్ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ గ్రాండ్ మాస్టర్ ఎం. జయంత్ రెడ్డి, 1వ వరల్డ్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్ తెలంగాణ, దక్షిణ భారత ఆర్గనైజింగ్ మేనేజర్ రాజు రాథోడ్ చిన్నారి విఠత్ రామ్‌ను అభినందించి సత్కరించారు.

రెండు గోల్డ్ మెడల్స్‌తో డబుల్ గోల్డ్ విజేత

ఆగస్టు 22, 23 తేదీల్లో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన 1వ వరల్డ్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లోనూ విఠత్ రామ్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. క్యోరుగి పీవీ విభాగంలోని 5 సంవత్సరాల వయస్సు కేటగిరీతో పాటు స్పీడ్ కికింగ్ విభాగంలో పాల్గొని రెండు గోల్డ్ మెడల్స్ సాధించి డబుల్ గోల్డ్ విజేతగా నిలిచాడు.

ఈ అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో జాంబియా, ఇథియోపియా, మారిషస్, జపాన్, శ్రీలంక, నేపాల్, దక్షిణాఫ్రికా తదితర దేశాలతో పాటు మొత్తం 12 దేశాలు, భారతదేశంలోని 22 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఇంతటి అంతర్జాతీయ వేదికపై కేవలం ఐదేళ్ల వయస్సులోనే ప్రపంచ రికార్డుతో పాటు రెండు గోల్డ్ మెడల్స్ సాధించడం విశేషమని నిర్వాహకులు పేర్కొన్నారు.

కుటుంబ సభ్యుల ఆనందం

నాగర్‌కర్నూల్ జిల్లా అచంపేటలోని వివేకానంద స్కూల్‌లో నర్సరీ విద్యను అభ్యసిస్తున్న బి. విఠత్ రామ్ ఈ అరుదైన ఘనత సాధించడంపై కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తల్లి లలిత భవాని, తండ్రి బి. రాజారాం తమ కుమారుడు సాధించిన విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో దేశానికి, రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

అమికల్ స్పోర్ట్స్ అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్ వీణా వాహిని, జేఆర్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ ఫౌండర్ గ్రాండ్ మాస్టర్ ఎం. జయంత్ రెడ్డి, తెలంగాణ, దక్షిణ భారత ఆర్గనైజింగ్ మేనేజర్ రాజు రాథోడ్ మాట్లాడుతూ.. చిన్నారి విఠత్ రామ్‌లోని ప్రతిభను చిన్న వయస్సులోనే గుర్తించి సరైన శిక్షణ, ప్రోత్సాహం అందిస్తే భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి మరిన్ని పతకాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు.

కేవలం ఐదేళ్ల వయస్సులోనే ప్రపంచ రికార్డు, స్పీడ్ పంచింగ్, స్పీడ్ కికింగ్‌లో అద్భుత ప్రదర్శనతో పాటు అంతర్జాతీయ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన బి. విఠత్ రామ్ అచంపేటతో పాటు నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడు.

ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి బి. విఠత్ రామ్‌కు ఆయుష్ 24 న్యూస్ తరఫున హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్తులో మరెన్నో జాతీయ, అంతర్జాతీయ విజయాలు సాధించి భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటాలని ఆకాంక్షిస్తున్నాం.

జై హింద్! 🇮🇳🥋🏆🌍

అయుష్ 24 న్యూస్
www.ayush24news.com

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 4🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *