గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవరకొండ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి
దేవరకొండ: సెప్టెంబర్ 28 (AYUSH24 News ప్రతినిధి)
హైదరాబాద్‌లోని గద్దమ్స్ ఎన్‌క్లేవ్‌లో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద సోమవారం విఘ్నేశ్వరుని నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవరకొండ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి నేనావత్ శివనాయక్‌ను నిర్వాహకులు ముఖ్య అతిథిగా ఆహ్వానించి, శాలువాతో ఘనంగా సన్మానించారు.
దేవరకొండ నియోజకవర్గ ఇన్చార్జిగా నూతన బాధ్యతలు చేపట్టిన శివనాయక్ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆశీస్సులతో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా శివనాయక్ మాట్లాడుతూ తనను అభిమానించే నాయకులు, కార్యకర్తలను ఎన్నటికీ మరిచిపోనని తెలిపారు.
చిన్నతనం నుంచే వినాయక చవితి అంటే ఎంతో ఇష్టం
వినాయక చవితి పండుగ అంటే తనకు చిన్నతనం నుంచే ఎంతో ఇష్టమని శివనాయక్ తెలిపారు. చిన్నప్పుడు వినాయక విగ్రహాలను తయారు చేసి మండపాల వద్ద ఏర్పాటు చేసి పూజలు నిర్వహించేవాడినని గుర్తుచేసుకున్నారు. విద్యార్థి దశలోనూ వినాయక మండపం ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు ఉత్సవాల్లో ఆనందంగా పాల్గొనేవాడినని తెలిపారు.
మండప నిర్వాహకులకు సహాయం అందిస్తా
గణేష్ మండప నిర్వాహకులకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని, అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటానని శివనాయక్ తెలిపారు. అనంతరం వినాయకుడి శోభాయాత్రలో పాల్గొని నిమజ్జన కార్యక్రమంలో భాగస్వామయ్యారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth









Leave a Reply