మూడు రోజులుగా కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమాలు
300 మంది రోగులు, వారి సహాయకులకు అల్పాహారం అందజేత
అభినయ్ రాజ్ జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి: లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య
దేవరకొండ, అక్టోబర్ 08, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
కీర్తిశేషులు గాజుల అభినయ్ రాజ్ జ్ఞాపకార్థం లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అల్పాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులు, వారి సహాయకులు కలిపి సుమారు 300 మందికి అల్పాహారం అందజేశారు.
పితృపక్ష వారోత్సవాల్లో భాగంగా గాజుల రాజేష్, ఉషారాణి దంపతులు తమ కుమారుడు అభినయ్ రాజ్ జ్ఞాపకార్థం మూడు రోజులుగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య మాట్లాడుతూ, గాజుల అభినయ్ రాజ్ భౌతికంగా దూరమైనప్పటికీ దేవరకొండ లయన్స్ క్లబ్ సభ్యులు, పట్టణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.
కుమారుడి జ్ఞాపకాలను తల్లిదండ్రులు గాజుల రాజేష్, ఉషారాణి నేటికీ మర్చిపోలేకపోతున్నారని పేర్కొన్నారు. తమ కుమారుడి ఆత్మకు శాంతి చేకూరాలనే సంకల్పంతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.
గాజుల రాజేష్ తన కుమారుడితో పాటు కుమార్తెను కూడా లయన్స్ క్లబ్లో సభ్యులుగా చేర్పించారని జంగయ్య గుర్తుచేశారు. సేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులందరినీ భాగస్వాములను చేయడం విశేషమని పేర్కొన్నారు.
గాజుల అభినయ్ రాజ్‌ను దేవరకొండ లయన్స్ క్లబ్ ఎన్నటికీ మర్చిపోదని, ఆయన జ్ఞాపకార్థం, ఆత్మశాంతి కోసం భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని జంగయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది గాజుల ఆంజనేయులు, గాజుల శ్రీనివాస్, లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కాశిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారి చిలుకూరి కాశీనాథ్, జోన్ చైర్మన్ గాజుల ఉషారాణి, సీనియర్ లయన్స్ సభ్యులు గాజుల బుచ్చయ్య, లకుమారపు మల్లయ్య, హరి వెంకటేశ్వరరావు, దినేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply