Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● పెద్దపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించకపోవడానికి మంత్రి శ్రీధర్ బాబే కారణం: పుట్ట మధూకర్● ఈ-వేస్ట్ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన● ఎల్ నినో ప్రభావం-నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన సదస్సు● రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలకు దేవరకొండ క్రీడాకారిణి పూజ ఎంపిక● గడ్డం నాగయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకులు వడ్త్య రమేష్● చందంపేట మండలంలో ఎమ్మెల్యే బాలు నాయక్ సుడిగాలి పర్యటన● దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్● నల్లగొండలో నవంబర్ 2న బిఎల్‌ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి● పెద్దపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించకపోవడానికి మంత్రి శ్రీధర్ బాబే కారణం: పుట్ట మధూకర్● ఈ-వేస్ట్ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన● ఎల్ నినో ప్రభావం-నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన సదస్సు● రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలకు దేవరకొండ క్రీడాకారిణి పూజ ఎంపిక● గడ్డం నాగయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకులు వడ్త్య రమేష్● చందంపేట మండలంలో ఎమ్మెల్యే బాలు నాయక్ సుడిగాలి పర్యటన● దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్● నల్లగొండలో నవంబర్ 2న బిఎల్‌ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి
Home › బ్రేకింగ్ న్యూస్ › చందంపేట మండలంలో ఎమ్మెల్యే బాలు నాయక్ సుడిగాలి పర్యటన
బ్రేకింగ్ న్యూస్

చందంపేట మండలంలో ఎమ్మెల్యే బాలు నాయక్ సుడిగాలి పర్యటన

చందంపేట, అక్టోబర్ 28 (Ayush 24 News): దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. బుధవారం చందంపేట మండలంలో ఆయన సుడిగాలి పర్యటన చేపట్టి పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ

01:22 మధ్యాహ్నం PM

చందంపేట, అక్టోబర్ 28 (Ayush 24 News):
దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. బుధవారం చందంపేట మండలంలో ఆయన సుడిగాలి పర్యటన చేపట్టి పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యేకు ప్రజలు, మహిళలు ఘన స్వాగతం పలికారు.
గ్రామాల్లో వెలుగులు.. రహదారుల అభివృద్ధికి శ్రీకారం
చిత్రియాల గ్రామంలోని కాటమయ్య గుడి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రారంభించారు. అనంతరం రేకులగడ్డ గ్రామంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. గ్రామాల్లో రాత్రివేళ వెలుతురు సౌకర్యం మెరుగుపడటంతో ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
అనంతరం బుడ్డోనితండా గ్రామ పరిధిలోని వెంకట్ తండాలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, రహదారుల అభివృద్ధితో ప్రజల రాకపోకలు మరింత సులభతరం అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కీరు నాయక్‌కు నివాళులు
యాపలపాయ తండా సర్పంచ్ మకట్ లాల్ తండ్రి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కీరు నాయక్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీకి, ప్రజలకు కీరు నాయక్ అందించిన సేవలను స్మరించుకున్నారు.
మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన
మూడుదండ్ల గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బాలు నాయక్ శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాల సమావేశాలు, స్వయం సహాయక సంఘాల కార్యకలాపాల నిర్వహణకు ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు, మహిళా సంఘాల బలోపేతానికి అవసరమైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
పేదల సొంతింటి కల సాకారం.. మూడు ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశాలు
మూడుదండ్ల గ్రామంలో మూడు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. సొంత ఇల్లు పేద కుటుంబాలకు ఆత్మగౌరవం, భద్రతను కల్పిస్తుందని అన్నారు. అర్హులైన పేదలకు గృహ వసతి కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధిదారుల సొంతింటి కల నెరవేరుతోందని పేర్కొన్నారు.
పర్యటనలో పాల్గొన్న నాయకులు, ప్రజాప్రతినిధులు
ఈ కార్యక్రమాల్లో దొండేటి మల్లారెడ్డి, ఏడ్పుల గోవింద్ యాదవ్, జర్పుల భధ్యా నాయక్, వాంకునావత్ బిక్కు నాయక్, మారుపాకుల సురేష్ గౌడ్, కిన్నెర హరికృష్ణ, కాకునూరి రంగయ్య గౌడ్, వాంకునావత్ పాపా నాయక్, నేనావత్ భరత్ కుమార్, మహ్మద్ సాధిక్, గోసుల అనంతగిరి, జక్కుల మున్నయ్య యాదవ్, ఎలిజర్ల ఈదమయ్య, కుర్మేటి వంశీ శర్మ, కేతావత్ నీలా, మకట్ లాల్, నేనావత్ లచ్చిరాం, ఎలుక జాలాంధర్ గౌడ్, మూడావత్ లాల్ సింగ్, మూడావత్ బాలు, బొద్దికూర మహాలక్ష్మయ్య, లోకసాని నారాయణ రెడ్డి, చాట్ల చిరంజీవి, నడింపల్లి సత్యం గౌడ్, బెజవాడ వెంకటయ్య గౌడ్, బొల్లు రామకృష్ణ యాదవ్, కొండ్రపల్లి నగేష్‌తో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
Ayush 24 News | దేవరకొండ

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 1🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
261 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App