ఐలమ్మ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి
పెద్దపల్లి: సెప్టెంబర్ 26 (AYUSH24 News ప్రతినిధి)
తెలంగాణ మట్టి ఆత్మగౌరవానికి, వీరత్వానికి నిలువెత్తు రూపం వీరనారి చాకలి ఐలమ్మ అని బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ దొరల అరాచకాలు, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ వీరోచితంగా పోరాడారని పేర్కొన్నారు. తన భూమి, హక్కుల కోసం ఆమె సాగించిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని, మహిళల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆమె చూపిన బాటలో పయనించాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ త్యాగాలను స్మరించుకుంటూ ఆమె జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించి గౌరవించిందని దాసరి ఉష గుర్తుచేశారు. చాకలి ఐలమ్మ ఆశయ సాధనతో పాటు బహుజనులు, మహిళల సాధికారత కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply