Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం
బ్రేకింగ్ న్యూస్

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

11:44 ఉదయం AM

అయుష్ 24 న్యూస్ ప్రతినిధి

మంథని, సెప్టెంబర్ 10: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీర వనిత చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు.

చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మంథనిలోని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ఐటీ, ఈసీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, మాజీ ఎంపీపీ కొండ శంకర్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట పటిమ తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.

తన భూమి కోసం మాత్రమే కాకుండా పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ పోరాడారని పేర్కొన్నారు. సామాజిక అన్యాయం, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.

భూమి, భుక్తి, విముక్తి కోసం నాటి నిరంకుశ పాలనకు ఎదురొడ్డి నిలిచిన ఐలమ్మ అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన మహానీయురాలని కొనియాడారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవాన్ని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన చాకలి ఐలమ్మ సేవలు, త్యాగాలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని నాయకులు అన్నారు. ఆమె స్ఫూర్తితో సమానత్వం, సామాజిక న్యాయం సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 13🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
1 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *