Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › దేవరకొండ › చారిత్రక కట్టడాల పరిరక్షణే INTACH నల్లగొండ చాప్టర్ లక్ష్యం
దేవరకొండ

చారిత్రక కట్టడాల పరిరక్షణే INTACH నల్లగొండ చాప్టర్ లక్ష్యం

03:16 మధ్యాహ్నం PM

వారసత్వ సంపద పరిరక్షణకు సమష్టి కృషి అవసరం: చాప్టర్ కన్వీనర్ సముద్రాల ధనంజయ్య

నల్లగొండ, అక్టోబర్ 05, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

జిల్లాలోని చారిత్రక కట్టడాలు, పురావస్తు సంపద, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించేందుకు సభ్యులంతా సమష్టిగా కృషి చేయాలని INTACH నల్లగొండ జిల్లా చాప్టర్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. స్థానిక లయన్స్ భవన్‌లో సోమవారం చాప్టర్ రెండో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యుల పరిచయ కార్యక్రమంతో పాటు గుర్తింపు కార్డులు, బ్రోచర్లను అందజేశారు.

చాప్టర్ కన్వీనర్ సముద్రాల ధనంజయ్య, కో-కన్వీనర్ డాక్టర్ ఆడెపు రమేష్ INTACH లక్ష్యాలు, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.

ఈ సందర్భంగా సముద్రాల ధనంజయ్య మాట్లాడుతూ, 1969 నుంచి సంస్కృతి పరిరక్షణ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అదే స్ఫూర్తితో దేవరకొండ ఖిల్లా పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఖిల్లా పరిరక్షణ కోసం సంఘం ద్వారా ప్రజాప్రతినిధులకు విన్నవించడంతో పాటు చారిత్రక విశేషాలను వీడియో రూపంలో భద్రపరిచినట్లు పేర్కొన్నారు.

జిల్లాలోని వారసత్వ ప్రదేశాలను గుర్తించి, వాటి పరిరక్షణకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా నిపుణుల సూచనలు, ప్రజల భాగస్వామ్యంతో కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతామని తెలిపారు. స్థానిక పండుగలు, కళలు, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

కో-కన్వీనర్ డాక్టర్ ఆడెపు రమేష్ మాట్లాడుతూ, వారసత్వ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో చరిత్ర, సంస్కృతిపై ఆసక్తి పెంచేందుకు నెలవారీ హెరిటేజ్ వాక్స్, వ్యాసరచన, చిత్రలేఖనం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వేదకుమార్ ప్రోత్సాహంతో INTACH జీవితకాల సభ్యత్వం తీసుకున్నట్లు తెలిపారు. నల్లగొండ చాప్టర్‌ను ఉత్తమ చాప్టర్‌గా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి పనిచేయాలని కోరారు.

అంబటి వెంకన్న మాట్లాడుతూ, రాచకొండ, పానగల్లు, భువనగిరి, దేవరకొండ వంటి ప్రాంతాల చారిత్రక విశేషాలను వెలికితీసి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. INTACHను పరిచయం చేసి ప్రోత్సహించిన వేదకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నల్లగొండ వైభవాన్ని ప్రతిబింబించే పాటను ఆలపించారు.

జగిని భీమయ్య మాట్లాడుతూ, INTACH నల్లగొండ చాప్టర్ ద్వారా వారసత్వ ప్రదేశాల పరిరక్షణకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. సంస్థలో భాగస్వామిని చేసిన వేదకుమార్, కన్వీనర్ సముద్రాల ధనంజయ్య, కో-కన్వీనర్ డాక్టర్ ఆడెపు రమేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

పల్లె సతీష్ సమావేశాన్ని సమన్వయం చేశారు. కార్యక్రమంలో జ్యోతిరెడ్డి, అంజన్, లింగయ్య, నవీన్‌కుమార్, శంకర్, లింగమూర్తి, వెంకటేశ్వర్లు తదితరులతో పాటు చాప్టర్ సభ్యులు, వారసత్వ పరిరక్షణపై ఆసక్తి కలిగినవారు, స్థానిక పాత్రికేయులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 26🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
219 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App