ఆకట్టుకుంటున్న ముసిని మిషిత గీసిన వినాయకుని చిత్రాలు
దేవరకొండ | సెప్టెంబర్ 16 | AYUSH24 NEWS ప్రతినిధి
వినాయక చవితి పండుగ వచ్చిందంటే చిన్నారుల్లో సందడి నెలకొంటుంది. వినాయక మండపాల వద్ద సాయంత్రం నుంచి రాత్రి వరకు నృత్యాలు, పాటలతో జరిగే వేడుకలు చిన్నారులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. మరోవైపు పాఠశాలల్లో ఖాళీ సమయంలో వినాయకుడి చిత్రాలను గీస్తూ తమ సృజనాత్మకతను చాటుకుంటున్నారు.
దేవరకొండ పట్టణానికి చెందిన డాక్టర్ ముసిని వెంకటేష్–రాజ్యలక్ష్మి దంపతుల కుమార్తె ముసిని మిషిత ప్రస్తుతం హైదరాబాద్లో ఐదో తరగతి చదువుతోంది. వినాయక నవరాత్రుల్లో భాగంగా మూడో రోజు వినాయకుడితో పాటు ఆయన వాహనం మూషికుడి చిత్రాన్ని కూడా చక్కగా చిత్రీకరించింది. ఈ చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా, చూసిన పలువురు చిన్నారి ప్రతిభను అభినందిస్తున్నారు.
చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ

చదువుతో పాటు ఆటలు, సైన్స్ వంటి విజ్ఞానపరమైన అంశాలపై ఆసక్తి కనబరుస్తున్న మిషిత.. చిత్రలేఖనంలోనూ తనదైన శైలిని ప్రదర్శిస్తోంది. చిన్నారి గీసే చిత్రాలు ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను ఆకట్టుకుంటున్నాయి.
భవిష్యత్తులో మరిన్ని చిత్రలేఖన పోటీల్లో మిషిత ప్రతిభ కనబరచాలని, విద్యలోనూ ప్రథమ శ్రేణిలో రాణించాలని ఆమె తల్లిదండ్రులు, తాత–నానమ్మ, అన్నయ్య, బాబాయి–పిన్ని, మేనత్తలు, మేనమామలు, బంధువులు ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు.
— AYUSH24 NEWS










Leave a Reply