దేవరకొండలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం
దేవరకొండ | సెప్టెంబర్ 16 | AYUSH24 NEWS ప్రతినిధి
గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని దేవరకొండ ఐసీడీఎస్ సీడీపీఓ చంద్రకళ సూచించారు.
జాతీయ పోషణ మాసం సందర్భంగా బుధవారం దేవరకొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని దేవరకొండ–11 అంగన్వాడీ కేంద్రం, శివాజీనగర్‌లో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీడీపీఓ చంద్రకళ మాట్లాడుతూ.. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలు తమ పరిసరాల్లో లభించే సిరిధాన్యాలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు, పాలు వంటి పోషకాహారాన్ని ప్రతిరోజూ ఆహారంలో భాగంగా చేసుకోవాలని తెలిపారు.

సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు పిల్లల ఎదుగుదలకు కూడా మేలు జరుగుతుందని ఆమె వివరించారు. కుటుంబాల్లో పోషకాహారంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఎం. విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్ టీ. పద్మావతి, ఆయమ్మ ఆసియా, గర్భిణీలు, బాలింతలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply