Friday, 30 Oct 2026
30 Oct 2026Friday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● పేరపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు● మంథనిలో వైభవంగా శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయ శిఖర కలాపకర్షణ పూజలు● హెచ్‌సీఏ వన్డే లీగ్‌లో మంథని యువ క్రికెటర్ ఖాజా మజహరుద్దీన్ అదరగొట్టాడు● టీఎస్ యుటిఎఫ్ ఎం జె పి ప్రధాన కార్యదర్శిగా కొండ్రపల్లి శ్రీను ఎన్నిక● మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలపైనిరసన బాట● పెంచికల్పహాడ్ గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినుల ఆత్మహత్యా యత్నంపై సమగ్ర విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ● జల్సా సీరతున్ నబీ సభకు పటిష్ట పోలీస్ బందోబస్తు కల్పించాలి: ఈద్గా కమిటీ● ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యం: ఎమ్మెల్యే బాలు నాయక్● పేరపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు● మంథనిలో వైభవంగా శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయ శిఖర కలాపకర్షణ పూజలు● హెచ్‌సీఏ వన్డే లీగ్‌లో మంథని యువ క్రికెటర్ ఖాజా మజహరుద్దీన్ అదరగొట్టాడు● టీఎస్ యుటిఎఫ్ ఎం జె పి ప్రధాన కార్యదర్శిగా కొండ్రపల్లి శ్రీను ఎన్నిక● మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలపైనిరసన బాట● పెంచికల్పహాడ్ గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినుల ఆత్మహత్యా యత్నంపై సమగ్ర విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ● జల్సా సీరతున్ నబీ సభకు పటిష్ట పోలీస్ బందోబస్తు కల్పించాలి: ఈద్గా కమిటీ● ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యం: ఎమ్మెల్యే బాలు నాయక్
Home › బ్రేకింగ్ న్యూస్ › జల్సా సీరతున్ నబీ సభకు పటిష్ట పోలీస్ బందోబస్తు కల్పించాలి: ఈద్గా కమిటీ
బ్రేకింగ్ న్యూస్

జల్సా సీరతున్ నబీ సభకు పటిష్ట పోలీస్ బందోబస్తు కల్పించాలి: ఈద్గా కమిటీ

దేవరకొండ, అక్టోబర్ 30: దేవరకొండ పట్టణంలోని ఆఖ్సా మస్జిద్‌లో రేపు మదర్సా మిస్బ ఉల్ ఉలూమ్, ఈద్గా కమిటీ, జమియత్ ఉలేమా ఏ హింద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 36వ జల్సా సీరతున్ నబీ సభకు పటిష్ట పోలీస్ బందోబస్తు కల్పించాలని ఈద్గా కమిటీ నాయకులు కోరారు. ఈ మేరకు

01:31 మధ్యాహ్నం PM

దేవరకొండ, అక్టోబర్ 30:
దేవరకొండ పట్టణంలోని ఆఖ్సా మస్జిద్‌లో రేపు మదర్సా మిస్బ ఉల్ ఉలూమ్, ఈద్గా కమిటీ, జమియత్ ఉలేమా ఏ హింద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 36వ జల్సా సీరతున్ నబీ సభకు పటిష్ట పోలీస్ బందోబస్తు కల్పించాలని ఈద్గా కమిటీ నాయకులు కోరారు.
ఈ మేరకు శుక్రవారం దేవరకొండ పట్టణ సీఐ పి. వెంకట్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సభకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పలువురు మత పెద్దలు, జమియత్ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అదేవిధంగా దేవరకొండ నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి సుమారు 3 నుంచి 4 వేల మంది ప్రజలు పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు.
భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, సభ ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా తగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సీఐని కోరారు.
ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటీ ప్రధాన కార్యదర్శి యండి. ఇలియాస్ పటేల్, ఉపాధ్యక్షులు ఎం.ఏ. సాలర్ ఖదీర్, యండి. సలీమ్, ఖాజా మైనొద్దీన్, సయ్యద్ దస్తగిర్, ఎం.ఏ. ఖాలేఖ్, ఎస్.కే. ఇల్యాస్ బాబా తదితరులు పాల్గొన్నారు.
Ayush 24 News

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 21🔗 Shares: 2👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
272 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App