భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకుల పిలుపు
దేవరకొండ: సెప్టెంబర్ 28 (AYUSH24 News ప్రతినిధి)
దేవరకొండ పట్టణంలోని గాంధీనగర్లో టీం రుద్ర ఆధ్వర్యంలో సెప్టెంబర్ 29న సాయంత్రం 5 గంటలకు గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు, రిటైర్డ్ ఆర్మీ జక్కుల శ్రీనివాస్ తెలిపారు. గాంధీనగర్లోని లిటిల్ హార్ట్స్ స్కూల్ ముందు నుంచి నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
విఘ్నేశ్వరుని శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు పలకాలని జక్కుల శ్రీనివాస్ కోరారు.
నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి
గాంధీనగర్లో ఏర్పాటు చేసిన వినాయక మండపం నుంచి భక్తులతో కలిసి గణేశుడిని నిమజ్జనానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జక్కుల శ్రీనివాస్ తెలిపారు.
నిమజ్జన మహోత్సవానికి హాజరయ్యే భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించడంతో పాటు మహిళలకు ప్రత్యేక రంగు చీరలు, కోలాటం కర్రలు, యువతకు లాల్చీలు అందజేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth









Leave a Reply