Friday, 30 Oct 2026
30 Oct 2026Friday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● టీఎస్ యుటిఎఫ్ ఎం జె పి ప్రధాన కార్యదర్శిగా కొండ్రపల్లి శ్రీను ఎన్నిక● మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలపైనిరసన బాట● పెంచికల్పహాడ్ గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినుల ఆత్మహత్యా యత్నంపై సమగ్ర విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ● జల్సా సీరతున్ నబీ సభకు పటిష్ట పోలీస్ బందోబస్తు కల్పించాలి: ఈద్గా కమిటీ● ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యం: ఎమ్మెల్యే బాలు నాయక్● కొండ్రపల్లి శ్రీనుకు ఘన సన్మానం… ఉపాధ్యాయ, విద్యార్థి సమస్యల పరిష్కారమే నా ప్రథమ కర్తవ్యం: టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండ్రపల్లి శ్రీను● చందంపేట మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మృతి చెందిన రెండు కుటుంబాలకు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం● రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం.. 100 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాల పంపిణీ● టీఎస్ యుటిఎఫ్ ఎం జె పి ప్రధాన కార్యదర్శిగా కొండ్రపల్లి శ్రీను ఎన్నిక● మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలపైనిరసన బాట● పెంచికల్పహాడ్ గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినుల ఆత్మహత్యా యత్నంపై సమగ్ర విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ● జల్సా సీరతున్ నబీ సభకు పటిష్ట పోలీస్ బందోబస్తు కల్పించాలి: ఈద్గా కమిటీ● ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యం: ఎమ్మెల్యే బాలు నాయక్● కొండ్రపల్లి శ్రీనుకు ఘన సన్మానం… ఉపాధ్యాయ, విద్యార్థి సమస్యల పరిష్కారమే నా ప్రథమ కర్తవ్యం: టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండ్రపల్లి శ్రీను● చందంపేట మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మృతి చెందిన రెండు కుటుంబాలకు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం● రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం.. 100 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాల పంపిణీ
Home › బ్రేకింగ్ న్యూస్ › ట్రాన్స్‌జెండర్లకు నల్లగొండ డీఎస్పీ సూచనలు
బ్రేకింగ్ న్యూస్

ట్రాన్స్‌జెండర్లకు నల్లగొండ డీఎస్పీ సూచనలు

05:31 సాయంత్రం PM

బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: డీఎస్పీ శివరాం రెడ్డి

నల్లగొండ: ట్రాన్స్‌జెండర్లు చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదంగా జీవించాలని నల్లగొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి సూచించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా బలవంతంగా డబ్బులు వసూలు చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నల్లగొండలో నిర్వహించిన అవగాహన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. దుకాణాలు, వ్యాపార సంస్థలు, ఇళ్ల వద్ద బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయడం, డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడం, బెదిరించడం లేదా అసభ్యంగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

ట్రాఫిక్ సిగ్నల్స్, పండుగలు, శుభకార్యాల సందర్భాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. ప్రజలను వేధించడం లేదా బలవంతపు వసూళ్లకు పాల్పడటం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.

అదే సమయంలో ట్రాన్స్‌జెండర్లు కూడా సమాజంలో ఒక భాగమేనని, వారిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డీఎస్పీ పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోలీసులను సంప్రదించాలని సూచించారు.

ప్రజల హక్కులు, స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ చట్టబద్ధంగా వ్యవహరించాలని డీఎస్పీ శివరాం రెడ్డి కోరారు.

ఈ అవగాహన సమావేశంలో సీఐలు ఆదిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎస్‌ఐలు సైదాబాబు, షరీఫ్‌తో పాటు పట్టణానికి చెందిన పలువురు ట్రాన్స్‌జెండర్లు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 11🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
225 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App