Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● చిరుధాన్యాలతో ఆరోగ్యకరమైన ఆహారం.. పాతకాలపు ఆహారానికి మళ్లీ ఆదరణ!● తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు● రైతులకు అండగా సీసీఐ కొనుగోలు కేంద్రం.. భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● చిరుధాన్యాలతో ఆరోగ్యకరమైన ఆహారం.. పాతకాలపు ఆహారానికి మళ్లీ ఆదరణ!● తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు● రైతులకు అండగా సీసీఐ కొనుగోలు కేంద్రం.. భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు
Home › తాజా వార్తలు › తల్లిపాల వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన అడిషనల్ కలెక్టర్ ఎన్. పవన్ కుమార్, ఆర్డీఓ పద్మప్రియ
తాజా వార్తలు

తల్లిపాల వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన అడిషనల్ కలెక్టర్ ఎన్. పవన్ కుమార్, ఆర్డీఓ పద్మప్రియ

11:50 ఉదయం AM

పుట్టిన గంటలోపే ముర్రుపాలు ఇవ్వాలి.. ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలే ఉత్తమం – ఆర్డీఓ పద్మప్రియ

AYUSH24 NEWS | దేవరకొండ | 03-08-2026

దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పోస్టర్‌ను అడిషనల్ కలెక్టర్ ఎన్. పవన్ కుమార్ మరియు ఆర్డీఓ పద్మప్రియ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆర్డీఓ పద్మప్రియ మాట్లాడుతూ, ప్రసవానికి సమీపంలో ఉన్న ప్రతి గర్భిణీ కుటుంబాన్ని సందర్శించి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులు, సిబ్బందికి సూచించారు. బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు (Colostrum) తప్పనిసరిగా ఇవ్వాలని, అలాగే ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలను మాత్రమే అందించాలని సూచించారు.

తల్లిపాలలో సహజసిద్ధమైన వ్యాధి నిరోధక శక్తి ఉండటంతో పాటు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు, ముఖ్యంగా జ్ఞాపకశక్తి (IQ స్థాయి) పెరుగుదలకు ఎంతో దోహదపడుతుందని ఆమె వివరించారు. ప్రతి తల్లి తల్లిపాల ప్రాధాన్యతను గుర్తించి శిశువుకు పూర్తిస్థాయిలో అందించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ శ్రీమతి నిర్మల, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

– AYUSH24 NEWS | The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 3🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
673 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App