నిజామాబాద్, సెప్టెంబర్ 18 (ప్రతినిధి): నిజామాబాద్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ హెచ్. సతీష్ మృతి చెందారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఘటన చోటుచేసుకుంది.
శుక్రవారం తెల్లవారుజామున విధులు ముగించుకుని హెడ్‌క్వార్టర్స్‌కు తిరిగి వచ్చిన సతీష్.. అనంతరం తన ఆయుధాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఆర్ఐ సతీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపడుతున్నారు.










Leave a Reply