ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు పరీక్ష తేదీలు ప్రకటించిన నియామక మండలి
హైదరాబాద్, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్:
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాత పరీక్షల తేదీలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) ప్రకటించినట్లు సమాచారం. ఎస్ఐ పోస్టులకు నవంబర్ 29న, కానిస్టేబుల్ పోస్టులకు డిసెంబర్ 20న రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), అగ్నిమాపక, జైళ్ల శాఖ తదితర విభాగాల్లో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి 2026లో నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, వార్డర్, డిప్యూటీ జైలర్ తదితర పోస్టులు ఉన్నాయి.
ఈ నియామక ప్రక్రియకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తాజా నివేదిక ప్రకారం 7,437 పోస్టులకు 5.77 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.
అభ్యర్థులు పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లు, పరీక్ష కేంద్రాలు, పరీక్ష విధానం, తదుపరి ఎంపిక ప్రక్రియకు సంబంధించిన తాజా సమాచారాన్ని అధికారిక పోలీస్ నియామక మండలి వెబ్సైట్లో పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్










Leave a Reply