కొండారెడ్డిపల్లిలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ ఎమ్మెల్యే
దేవరకొండ, అక్టోబర్ 21, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
దసరా పండుగ సందర్భంగా తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.
విజయదశమి పర్వదినం రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అభివృద్ధి, శ్రేయస్సు నింపాలని ఎమ్మెల్యే బాలునాయక్ ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని కోరుకున్నారు.
దసరా పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పేర్కొన్నారు.









Leave a Reply