నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు
దేవరకొండ, సెప్టెంబర్ 24 (ప్రతినిధి): దేవరకొండ పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
‘వెళ్లి రావయ్యా గణేశా’ అంటూ భక్తుల నినాదాల మధ్య గణనాథుడి శోభాయాత్ర ఉత్సాహంగా సాగింది. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని పాటలు, నృత్యాలతో సందడి చేశారు. కాలనీ వీధుల గుండా సాగిన శోభాయాత్రలో ఒకవైపు యువత, మరోవైపు మహిళలు చేసిన నృత్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, నవరాత్రుల పాటు భక్తుల పూజలందుకున్న గణనాథుడిని కాలనీ వాసుల సమక్షంలో ఘనంగా నిమజ్జనం చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది వినాయక మండపాన్ని మరింత ఆకర్షణీయంగా అలంకరించడంతో పాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై గణనాథుడిని దర్శించుకొని పూజలు నిర్వహించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు, యువత, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









Leave a Reply