Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › దేవరకొండలో వైద్య, ప్రభుత్వ సేవలకు మరింత బలోపేతం
బ్రేకింగ్ న్యూస్

దేవరకొండలో వైద్య, ప్రభుత్వ సేవలకు మరింత బలోపేతం

10:29 ఉదయం AM

5 పడకల నుంచి 10 పడకలకు డయాలసిస్ కేంద్రం విస్తరణ.. సదరం క్యాంపు, అంబులెన్స్ ప్రారంభం

త్వరలో దేవరకొండలోనే వాహన రిజిస్ట్రేషన్ సేవలు

దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

దేవరకొండ, సెప్టెంబర్ 1 | అయుష్ 24 న్యూస్

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా దేవరకొండ నియోజకవర్గంలో వైద్య, ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేస్తున్నామని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పలు సౌకర్యాలను ప్రారంభించినట్లు తెలిపారు.

గతంలో 5 పడకల సామర్థ్యంతో ఉన్న డయాలసిస్ కేంద్రాన్ని 10 పడకలకు విస్తరించి, ఆధునిక వైద్య పరికరాలు, మౌలిక వసతులతో అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, వైద్యాధికారులతో కలిసి ఎమ్మెల్యే ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా దేవరకొండలోనే సేవలు అందించడమే లక్ష్యమన్నారు.

దేవరకొండలోనే సదరం సేవలు

దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ కోసం నల్లగొండకు వెళ్లాల్సిన ఇబ్బందులను తొలగిస్తూ దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలోనే వారానికి రెండు రోజులు సదరం క్యాంపులు నిర్వహించే ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో సమయం, ప్రయాణ ఖర్చులు తగ్గుతాయని ఎమ్మెల్యే తెలిపారు.

అంబులెన్స్ సేవలు ప్రారంభం

దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర రోగుల కోసం ఆర్‌టీఏ ఆధ్వర్యంలో అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను సకాలంలో ఆసుపత్రికి తరలించేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయని బాలు నాయక్ అన్నారు.

త్వరలో దేవరకొండలోనే వాహన రిజిస్ట్రేషన్

వాహనాల రిజిస్ట్రేషన్ తదితర సేవల కోసం ప్రజలు మిర్యాలగూడకు వెళ్లాల్సిన అవసరం లేకుండా త్వరలో దేవరకొండలోనే వాహన రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిందన్నారు.

కొత్త మండలాల్లో ప్రజలకు అన్ని ప్రభుత్వ శాఖల సేవలు ఒకే చోట అందేలా ఇంటిగ్రేటెడ్ మండల కార్యాలయాల సముదాయాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

దేవరకొండ నియోజకవర్గంలో వైద్యం, విద్య, సాగునీరు, రహదారులు, తాగునీరు, ప్రభుత్వ కార్యాలయాలు, సంక్షేమం వంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని బాలు నాయక్ స్పష్టం చేశారు.

కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 58🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *