రిబ్బన్ కట్ చేసి పుస్తకాల దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కొబ్బరికాయ కొట్టి నిర్వాహకుడు శేఖర్‌కు శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్వీటీ
దేవరకొండ, అక్టోబర్ 20, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
దేవరకొండ పట్టణంలోని స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన శేఖర్ బుక్ స్టాల్‌ను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మంగళవారం సాయంత్రం 5 గంటలకు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్వీటీ కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తన మిత్రుడు, బుక్ స్టాల్ నిర్వాహకుడు శేఖర్‌కు వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎమ్మెల్యేకు ఘన సత్కారం
బుక్ స్టాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్‌ను నిర్వాహకులు శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్నవారు ఒకరికొకరు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
కార్యక్రమంలో పలువురి పాల్గొనడం
ఈ కార్యక్రమంలో దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ ఉమామహేష్, వెంకటయ్య, రాజు, రాము, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply