Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › తాజా వార్తలు › దేవరకొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి
తాజా వార్తలు

దేవరకొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి

11:48 ఉదయం AM

మండల స్థాయిలోనే ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం

దేవరకొండ | అయుష్ 24 న్యూస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయిలోనూ నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేవరకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి ఎంపీడీవో ఆర్. సాగర్ తెలిపారు.

రాష్ట్ర, జిల్లా, రెవెన్యూ డివిజనల్ స్థాయిల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం తరహాలోనే మండల స్థాయిలోనూ ప్రజల సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ సోమవారం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.

మండల స్థాయికి చెందిన 23 శాఖల అధికారులు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు. తద్వారా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే పరిష్కారం పొందే అవకాశం కలుగుతుందని అన్నారు.

ప్రజల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేస్తారని ఇన్‌చార్జి ఎంపీడీవో ఆర్. సాగర్ తెలిపారు.

దేవరకొండ మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

— అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *