Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › ఉమ్మడి నల్లగొండ › దేవరకొండ ఖిల్లా అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే బాలు నాయక్
ఉమ్మడి నల్లగొండ

దేవరకొండ ఖిల్లా అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే బాలు నాయక్

01:55 మధ్యాహ్నం PM

చరిత్రను భావితరాలకు పరిచయం చేసేందుకు యువ టూరిజం పోటీలు

రోప్‌వే, బోటింగ్ సహా పర్యాటక వసతుల కల్పనకు ప్రణాళికలు

రూ.77 లక్షలతో 22 అంశాలపై డీపీఆర్ సిద్ధం చేసినట్లు వెల్లడి

దేవరకొండ, సెప్టెంబర్ 24 (ప్రతినిధి):
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు గురువారం యువ టూరిజం పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ హాజరయ్యారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ చారిత్రక ప్రాధాన్యం కలిగిన దేవరకొండ ఖిల్లా దుర్గాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇందుకోసం పర్యాటక శాఖ మంత్రి సహకారం తీసుకుంటామని చెప్పారు. దేవరకొండ ప్రాంతంలో ఖిల్లాతో పాటు వైజాగ్ కాలనీ, దేవరచర్ల వంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించే అవకాశాలు ఈ ప్రాంతానికి ఉన్నాయని పేర్కొన్నారు.

ఖిల్లా అభివృద్ధికి రూ.77 లక్షలతో 22 అంశాలతో కూడిన డీపీఆర్ సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దేవరకొండ ఖిల్లాను పర్యాటక శాఖ మంత్రి సందర్శించేలా ఇప్పటికే పలుమార్లు చర్చించినట్లు చెప్పారు. ఖిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరినట్లు పేర్కొన్నారు.

మెట్ల మార్గంలో వెళ్లలేని పర్యాటకుల కోసం రోప్‌వే ఏర్పాటు, మెట్ల మార్గం అభివృద్ధి, బోటింగ్ సదుపాయం, రాత్రి సమయంలోనూ పర్యాటకులు ఉండేందుకు అవసరమైన వసతులు కల్పించే దిశగా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన దేవరకొండ ఖిల్లాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్నది తన లక్ష్యమని పేర్కొన్నారు.

యువ టూరిజం పోటీల ద్వారా విద్యార్థులకు స్థానిక చరిత్ర, వారసత్వ సంపదపై అవగాహన పెరుగుతుందని చెప్పారు. ఖిల్లా చారిత్రక సంపదను పరిరక్షిస్తూ పర్యాటకులను ఆకర్షించేలా జిల్లా కలెక్టర్, పర్యాటక శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో సమీక్షించి పూర్తిస్థాయి అభివృద్ధి నివేదిక తీసుకుంటామని తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి పర్యటన సందర్భంగా ఖిల్లా చరిత్ర, అభివృద్ధి ప్రతిపాదనలను ఎల్‌ఈడీ డిజిటల్ ప్రదర్శన ద్వారా వివరించేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

దేవరకొండ పాతబజారుకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు మున్సిపల్ కార్యాలయం నుంచి ఖిల్లా వరకు రహదారి విస్తరణ చేపట్టడం, పాతబజారు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం తన ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ సందర్భంగా ఇంటాక్ నల్గొండ జిల్లా కన్వీనర్ లయన్ సముద్రాల ధనంజయ మాట్లాడుతూ యువ టూరిజం పోటీలు నిర్వహించడం ద్వారా చరిత్రను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు పర్యాటక ప్రాంతాల విశిష్టతను మరింత విస్తృతంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో నల్గొండ జిల్లా పర్యాటక శాఖ అధికారి అక్బర్ అలీ, డీపీఓ చక్రవర్తి, మున్సిపల్ కమిషనర్ రామ దుర్గారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, లయన్ సముద్రాల ధనంజయ, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 55🔗 Shares: 3👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
219 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App