మధ్యాహ్నం 12 గంటల తర్వాత వైద్యులు అందుబాటులో ఉండటం లేదని ఆరోపణ
దేవరకొండ: సెప్టెంబర్ 29 (AYUSH24 News ప్రతినిధి)
దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత వైద్యులు అందుబాటులో ఉండటం లేదని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు.
గంటల తరబడి ఓపీ కోసం వేచి ఉన్నప్పటికీ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రోగులు వాపోతున్నారు. ఉదయం 10 గంటలకు ఆసుపత్రికి వచ్చినా మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సి వస్తోందని కొందరు పేర్కొంటున్నారు.
సరైన వసతులు లేవని, వైద్యులు అందుబాటులో ఉండటం లేదని ఆరోపిస్తూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ ఆరోపణలపై ఆసుపత్రి అధికారుల వివరణ తెలియాల్సి ఉంది.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth









Leave a Reply