ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీ — మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
దేవరకొండ, అక్టోబర్ 06, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం అమ్మటోనిగూడెం స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మృతులను పెద్దమునిగల్కు చెందిన అంజయ్య, పోలేపల్లికి చెందిన కోటయ్యగా గుర్తించారు. ప్రమాద తీవ్రతకు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని తొలుత దేవరకొండలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటనతో అమ్మటోనిగూడెం స్టేజి పరిసరాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.










Leave a Reply