Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › ఉమ్మడి నల్లగొండ › దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం
ఉమ్మడి నల్లగొండ

దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం

దేవరకొండ, సెప్టెంబర్ 27: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం దేవరకొండ ఖిల్లా వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రపంచ పర్యాటక దినోత్సవం ప్రాముఖ్యతతో పాటు దేవరకొండ ఖిల్లా చారిత్రక విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ

06:32 ఉదయం AM

దేవరకొండ ఖిల్లా చారిత్రక వైభవాన్ని విద్యార్థులకు వివరించిన అసోసియేషన్ సభ్యులు

దేవరకొండ: సెప్టెంబర్ 27 (AYUSH24 News ప్రతినిధి)

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవరకొండ ఖిల్లా వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. శనివారం ఉదయం 7 గంటలకు నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు ప్రపంచ పర్యాటక దినోత్సవ ప్రాముఖ్యతతో పాటు దేవరకొండ ఖిల్లా చారిత్రక వైభవాన్ని వివరించారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్‌వీటీ మాట్లాడుతూ పర్యాటక రంగానికి ఉన్న సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక ప్రాధాన్యతను వివరించారు. పర్యాటక రంగం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనతో పాటు పర్యావరణ పరిరక్షణ, ఉపాధి అవకాశాలు, స్థానిక ఆర్థిక వ్యవస్థల అభివృద్ధికి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. డిజిటల్ టెక్నాలజీ, కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చని తెలిపారు.

దేవరకొండ ఖిల్లా చరిత్రను వివరిస్తూ, నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని ఏడు కొండల మధ్య చారిత్రక వైభవంతో ఈ గిరిదుర్గం విరాజిల్లుతోందని పేర్కొన్నారు. 14వ శతాబ్దంలో రేచర్ల పద్మనాయక వెలమ రాజులు ఈ కోటను నిర్మించారని, 1287 నుంచి 1482 వరకు వారి పరిపాలనలో ఇది కీలక కేంద్రంగా కొనసాగిందని వివరించారు. మాడ నాయుడు పాలనలో కోట మరింత అభివృద్ధి చెందిందని తెలిపారు.

శత్రువులకు దుర్భేద్యంగా ఉండేలా ఏడు కొండలను అనుసంధానిస్తూ విశాలమైన రక్షణ గోడలతో కోటను నిర్మించారని పేర్కొన్నారు. కోట ముఖద్వారంలో చెక్కిన ‘పూర్ణకుంభం’ ఈ ప్రాంత చారిత్రక ప్రతీకగా నిలుస్తోందన్నారు. ఖిల్లా పరిసరాల్లోని రామాలయం, ఆంజనేయస్వామి ఆలయం, శివాలయాలతో పాటు రాతి శిల్పకళ పర్యాటకులను ఆకట్టుకునేలా ఉందని తెలిపారు.

చుట్టూ కొండలు, అడవులు, ప్రకృతి అందాలతో దేవరకొండ ఖిల్లా ట్రెక్కింగ్‌కు, చరిత్రను తెలుసుకునేందుకు అనువైన ప్రాంతమని పేర్కొన్నారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన దేవరకొండ ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

అయుష్ 24 న్యూస్ — The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 54🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App