Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › ఉమ్మడి నల్లగొండ › దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు
ఉమ్మడి నల్లగొండ

దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

07:02 ఉదయం AM

ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు

దేవరకొండ: సెప్టెంబర్ 27 (AYUSH24 News ప్రతినిధి)

దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్‌వీటీ, గౌరవాధ్యక్షుడు కె. పంతులాల్ నాయక్ ఆధ్వర్యంలో సభ్యులు, విద్యార్థులు కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ 1895 సెప్టెంబర్ 26న వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లాలోని కిష్టాపురంలో జన్మించారని పేర్కొన్నారు. భుక్తి కోసం, భూమి కోసం, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం నాటి భూస్వాములు, రజాకార్ల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కొన్నారని తెలిపారు.

తన హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన చాకలి ఐలమ్మ ప్రజలకు స్ఫూర్తిదాయకమైన పోరాట యోధురాలని కొనియాడారు. దేశం, ప్రజల కోసం పోరాడిన మహనీయులను మరువకూడదని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, డీఎస్ఏ డాన్స్ మాస్టర్ క్రాంతి, పి. శ్రీనివాస్, వలమల్ల ఆంజనేయులు, కౌన్సిలర్ సాయి చంద్ర గౌడ్, జె. చంద్రయ్య పీడీ, ఇద్దయ్య, రాజేష్, రఘు, వెంకటేష్, సోమన్న, రాము, రాజుతో పాటు క్రీడాకారులు, కళాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అయుష్ 24 న్యూస్ — The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 26🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App