గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు
దేవరకొండ, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనంలో గురువారం ఉదయం 9 గంటలకు అధ్యక్షుడు ఎన్వీటీ, అసోసియేషన్ సభ్యులు, చిన్నారులు కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్బందర్లో జన్మించారని తెలిపారు. సత్యం, అహింస మార్గాలను అనుసరిస్తూ భారత స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారని పేర్కొన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం (దండి యాత్ర), క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. సత్యం, అహింస, స్వదేశీ వాడకం ఆయన ప్రధాన సిద్ధాంతాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, కె. పంతులాల్ నాయక్, లీగల్ అడ్వైజర్ ఉమా మహేష్, సముద్రాల వెంకన్న, కౌన్సిలర్ ముత్యాల రవి, తాళ్ల సురేష్, సన్నీ, మాకం మహేష్, జగదీశ్వరా చారి, వేణు, శ్రీను, కౌన్సిలర్ సాయి, నారాయణ, సైదులు, వలమల్ల ఆంజనేయులు, కరాటే మాస్టర్ గోపి, భాస్కర్ రెడ్డి, శ్రీనయ్య, కౌన్సిలర్ అజయ్ చంద్ర, సత్యం, అనన్య, కృప శ్రీ, మహిత, అస్మిత్ రాథోడ్, లక్కీ, హర్షవర్ధన్ రాథోడ్, విక్కి, బాబి, శివ, మహేష్‌తో పాటు క్రీడాకారులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply