నూతన కార్యవర్గానికి బాధ్యతల అప్పగింత.. పాత కమిటీ సభ్యులకు ఘన సన్మానం
దేవరకొండ: సెప్టెంబర్ 26 (AYUSH24 News ప్రతినిధి)
దేవరకొండ పట్టణంలోని హరిహర దేవస్థానం వృషభద్రి నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా దాసపత్రి జగదీశ్వర్, అధ్యక్షుడిగా జింకల లింగమయ్య, ఉపాధ్యక్షులుగా మసన యాదగిరి, ముసిని సత్తయ్య, వెలిజాల సురేష్, జింకల మధు, ప్రధాన కార్యదర్శిగా జల్ల ఆంజనేయులు, కోశాధికారిగా గుండు సురేష్ ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులను శాలువాలతో సన్మానించి బాధ్యతలు అప్పగించారు.
ఈ సందర్భంగా 2014 నుంచి ఇప్పటివరకు కొనసాగిన కమిటీ సభ్యులను సైతం శాలువాలతో సన్మానించారు. వారి సేవలను దేవాలయం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. పాత కమిటీలో అధ్యక్షుడిగా జింకల లింగమయ్య, ప్రధాన కార్యదర్శిగా దాసపత్రి జగదీశ్వర్, కోశాధికారిగా దాసపత్రి రవికుమార్ కొనసాగినట్లు పేర్కొన్నారు.
నూతన కమిటీలో సహాయ కార్యదర్శులుగా నీల నవీన్, భూష రాజు కుమార్, పగిడిమర్రి శివ, వనం మహేష్, సహాయ కోశాధికారులుగా దాసపత్రి రవికుమార్, జింకల భాను ప్రసాద్, ఈవెంట్ ఆర్గనైజర్‌గా బొడ్డుపల్లి అరవింద్ ఎన్నికయ్యారు.

కార్యవర్గ సభ్యులుగా వనం శ్రవణ్ కుమార్, నేలపట్ల సైదులు, మంగలిపల్లి నరసింహ, నరాల శ్రీకాంత్, దాసపత్రి రాము, పున్న రమేష్, ముసిని వెంకన్న, రాసమల్ల నాగయ్య, వనం ఉమామహేశ్వర్, వెలిజాల శ్రీను, గడుసు శ్రీనివాస్, గుండు నరేష్, ఏలే జగదీశ్వర్, రాగిశెట్టి మనోహర్, కడెం అజయ్, మంగినపల్లి కొండయ్య, నీల సైదులు, జింకల నరేష్, బొడ్డుపల్లి అనిల్ కుమార్, నీల చంద్రయ్య, గడిగా వెంకటయ్య, సూరపల్లి సూర్యనారాయణ, సూర్యపల్లి రాజా రమేష్, కామోజ్ వికాస్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన వారిని ఈ సందర్భంగా అభినందించారు.
దేవాలయం దినదినాభివృద్ధి చెందుతోందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి, దుర్గామాత నవరాత్రులు, శ్రీరామనవమి వేడుకలను నిర్వహించడంతో పాటు శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాతల సహకారంతో దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నూతన కమిటీ సభ్యులపై బాధ్యత ఉందన్నారు.
దేవీ నవరాత్రుల ఉత్సవాల నిర్వహణ కోసం మహిళా కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళా కమిటీ సభ్యులు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth









Leave a Reply