Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › నల్లగొండలో బ్యాంకు ఉద్యోగుల భారీ ర్యాలీ
బ్రేకింగ్ న్యూస్

నల్లగొండలో బ్యాంకు ఉద్యోగుల భారీ ర్యాలీ

05:02 తెల్లవారుజాము AM

న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్

సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల సమ్మె.. అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు హెచ్చరిక

నల్లగొండ, సెప్టెంబర్ 11 — అయుష్ 24 న్యూస్:

యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నల్లగొండ పట్టణంలో భారీ ర్యాలీ, నిరసన ప్రదర్శన నిర్వహించారు.

జిల్లాలోని వివిధ బ్యాంకులకు చెందిన సుమారు 600 మంది ఉద్యోగులు క్లాక్ టవర్ వద్ద ఉన్న ఎస్‌బీఐ నుంచి ర్యాలీగా బయలుదేరారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా నినాదాలు చేస్తూ ఎస్‌బీఐ రీజినల్ బిజినెస్ ఆఫీస్ (RBO) వద్దకు చేరుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు.

ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయాలి

ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఎల్‌ఐ (PLI) చెల్లింపుల్లో ఉన్న వివక్షను తొలగించి సమాన విధానాన్ని అమలు చేయాలని కోరారు.

12వ ద్వైపాక్షిక వేతన ఒప్పందంలో ఇంకా పరిష్కారం కాని అంశాలను, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బ్యాంకు పెన్షనర్లకు పెన్షన్ అప్‌డేషన్ చేపట్టాలని కోరారు.

బ్యాంకు ఉద్యోగులు దీర్ఘకాలంగా తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదని నాయకులు పేర్కొన్నారు. పలుమార్లు విజ్ఞప్తులు, చర్చలు జరిగినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతోనే దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాల్సి వస్తోందని తెలిపారు.

ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక

కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు.

సమస్యలు పరిష్కారం కాకపోతే UFBU పిలుపు మేరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల సమ్మె చేపడతామని, అప్పటికీ డిమాండ్లు పరిష్కారం కాకపోతే 2026 అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో AIBOC నాయకులు టి. శ్రామిక్, ఎస్.కె. రియాజ్ పాషా, NCBE నాయకులు టి. సుమన్ కుమార్, SBISUHC నల్లగొండ (AO) OBC ఆర్గనైజింగ్ సెక్రటరీ, SBI OBC ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ రాష్ట్ర అధ్యక్షుడు NVT, ఎం. ప్రవీణ్ కుమార్, ఎస్. జీవన్ కుమార్, ఎస్. నరసింహ, AIBEA నాయకులు కె. ఈశ్వర్, రాజశేఖర్, రాజుతో పాటు ఇతర UFBU నాయకులు పాల్గొని ప్రసంగించారు.

బ్యాంకు ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

— అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 21🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *