“పంబా ప్రదర్శన కళ – సాహిత్య, సాంస్కృతిక, సామాజిక అంశాల అధ్యయనం”పై పరిశోధన
దేవరకొండ, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
ప్రతిష్టాత్మక హైదరాబాద్ విశ్వవిద్యాలయం గురువారం నిర్వహించిన 26వ స్నాతకోత్సవంలో తిమ్మాపురం గ్రామానికి చెందిన పంబాల పర్వతాలుకు డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు.

“పంబా ప్రదర్శన కళ – సాహిత్య, సాంస్కృతిక, సామాజిక అంశాల అధ్యయనం” అనే అంశంపై పర్వతాలు చేసిన పరిశోధనకు గాను ఈ డాక్టరేట్‌ను అందజేశారు. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల సమక్షంలో యూనివర్సిటీ ఛాన్సలర్ జస్టిస్ ఎల్. నర్సింహా రెడ్డి, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అనురాధ చేతుల మీదుగా పంబాల పర్వతాలు డాక్టరేట్ పట్టాను స్వీకరించారు.

ఈ సందర్భంగా పంబాల పర్వతాలు మాట్లాడుతూ విద్యా ప్రస్థానంలో డాక్టరేట్ పట్టా ఒక చిరస్మరణీయమైన మైలురాయి అని పేర్కొన్నారు. ఈ స్థాయికి చేరుకునేందుకు సహకరించిన గురువులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
తిమ్మాపురం గ్రామానికి చెందిన పర్వతాలు ఉన్నత విద్యలో సాధించిన ఈ ఘనత పట్ల గ్రామస్థులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, విద్యావేత్తలు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.









Leave a Reply