Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి● గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.7,395.55 కోట్లతో కొత్త పథకం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి● గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.7,395.55 కోట్లతో కొత్త పథకం
Home › బ్రేకింగ్ న్యూస్ › పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో దేవరకొండ నియోజకవర్గం ప్రథమ స్థానం
బ్రేకింగ్ న్యూస్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో దేవరకొండ నియోజకవర్గం ప్రథమ స్థానం

- కోర్ర చందు నాయక్‌ను అభినందించిన ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు ​దేవరకొండ,28అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ): ఖమ్మం - వరంగల్ - నల్గొండ జిల్లాల పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియలో దేవరకొండ నియోజకవర్గం అత్యధిక ఎన్రోల్మెంట్‌తో మొదటి స్థానంలో

12:07 తెల్లవారుజాము AM

– కోర్ర చందు నాయక్‌ను అభినందించిన ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు

​దేవరకొండ,28అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ):
ఖమ్మం – వరంగల్ – నల్గొండ జిల్లాల పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియలో దేవరకొండ నియోజకవర్గం అత్యధిక ఎన్రోల్మెంట్‌తో మొదటి స్థానంలో నిలిచింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని హోటల్ విష్టా గ్రాండ్‌లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.
​ఈ సమావేశానికి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి మరియు ఎమ్మెల్సీ అభ్యర్థి డా. గడల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు కోర్ర చందు నాయక్ అత్యధిక ఓటర్లను నమోదు చేయించి పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా చందు నాయక్‌ను శాలువాతో సత్కరించి, ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
​ఈ కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గ కోఆర్డినేటర్ ప్రజిత్ గౌడ్, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల జనసేన పిఓసి (POC) లు మరియు ముఖ్య నాయకులు పాల్గొని ఎన్నికల కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
​పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తా: చందు నాయక్
ఈ సందర్భంగా జనసేన సీనియర్ నాయకుడు కోర్ర చందు నాయక్ మాట్లాడుతూ.. గత 13 సంవత్సరాలుగా జనసేన పార్టీలోనే కొనసాగుతూ, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నానని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తానన్నారు. తనను గుర్తించి ప్రోత్సహిస్తున్న కోఆర్డినేటర్ ప్రజిత్ గౌడ్‌కు, రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి గడల శ్రీనివాసరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
​తెలంగాణలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావును భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరుస్తూ తెలంగాణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
​ఈ కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గ కోఆర్డినేటర్ ప్రజిత్ గౌడ్, నరేష్ గౌడ్, బవండ్ల సాయి, కాటేపాక నవీన్, పిట్ల సిద్దు, రవి, వంటేద్దు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
​

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 27🔗 Shares: 2👍 Likes: 2
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
21 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App